రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’(Dhurandhar) రికార్డులు క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్ 2’ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో ‘ధురంధర్’ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంతకీ, అక్షయ్ కుమార్ ఏం మాట్లాడారు అంటే.. “ధురంధర్ సినిమానే ఉదాహరణగా తీసుకుందాం. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయినా, ప్రేక్షకులు దీనిని ఎంతగానో ఆదరించారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు, ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్‌కు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. దీంతో సినిమా గొప్ప విజయాన్ని సాధించింది’ అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.


