‘నాగబంధం’ నుంచి ఆకట్టుకుంటున్న ‘నమో రే నమోరే’ !

‘నాగబంధం’ నుంచి ఆకట్టుకుంటున్న ‘నమో రే నమోరే’ !

Published on Mar 15, 2026 5:03 PM IST

Nagabandham

పెద కాపు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ అవైటెడ్ పాన్‌-ఇండియా చిత్రమే “నాగబంధం”. ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. భారీ సినిమాల నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ‘నమో రే నమోరే’ అంటూ సాగే ఆ పాటకు శ్రీహర్ష లిరిక్స్‌ అందించగా జునైద్‌ కుమార్‌ స్వరపరిచారు. పాటలోని విజువల్స్ అండ్ ట్యూన్ చాలా బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పురాతనమైన రహస్యాలు, నాగబంధం సాంప్రదాయంతో ముడిపడిన కథతో ఈ సినిమా సాగనుంది. అన్నట్టు పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ చిత్రంలో మురళి శర్మ, జయ ప్రకాష్, బిఎస్ అవినాష్ మరియు అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు