ఇప్పుడు యావత్తు భారతదేశం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే “ధురంధర్ 2”. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో కాలంగా బాలీవుడ్ సినిమా మిస్ అవుతున్న పర్ఫెక్ట్ పాన్ ఇండియా వైబ్ ని తీసుకొచ్చింది. ఇలా ఆల్రడీ భారీ ఓపెనింగ్స్ ని ఖాయం చేసుకున్న ఈ సినిమా డే 1 ఎలాంటి నంబర్స్ సెట్ చేస్తుంది అనేదే చర్చగా మారింది.
పార్ట్ 1 విడుదలకి ముందు ఇది ఇంత సెన్సేషన్ సెట్ చేస్తుంది అని మేకర్స్ కూడా భావించలేదు కానీ సీన్ కట్ చేస్తే ఇండియన్ సినిమా దగ్గర పార్ట్ 1 చిత్రాల్లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇదే ఊపులో పార్ట్ 2 పై హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 200 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనే లేకపోలేదు అనే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 200 కోట్ల ఓపెనింగ్స్ ఉన్న సినిమాలు అన్నీ దాదాపు మన తెలుగు సినిమా నుంచే ఉన్నాయి.
హిందీ మార్కెట్ లో మంచి లాంగ్ రన్స్ ఉంటాయి కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం 150 కోట్లు లోపే ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు ధురంధర్ 2 కి అడ్వాంటేజ్ ఏంటంటే మన సినిమాలు ఎలాగైతే తెలుగు, హిందీ, ఓవర్సీస్ మార్కెట్ లలో మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నాయో పాన్ ఇండియా లెవెల్లో ధురంధర్ 2 కి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు కానీ ఖచ్చితంగా బాలీవుడ్ చరిత్రలోనే ఇదొక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ అవుతుందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.


