ధురంధర్ 2 సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా..?

ధురంధర్ 2 సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా..?

Published on Mar 17, 2026 4:40 PM IST

Dhurandhar 2

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన “ధురందర్: ది రివెంజ్” (Dhurandhar 2) విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బుధవారం నుండే పెయిడ్ ప్రివ్యూల ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈ ప్రివ్యూలకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే సుమారు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

​ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇక సినిమా నిడివి విషయానికొస్తే, ఇది ఏకంగా 3 గంటల 49 నిమిషాలు ఉండటం గమనార్హం. గతంలో టికెటింగ్ ప్లాట్‌ఫారమ్స్‌లో 3 గంటల 55 నిమిషాలుగా చూపించినప్పటికీ, ఫైనల్ కట్‌లో కొన్ని సన్నివేశాలను తొలగించడంతో నిడివి స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. భారీ నిడివి ఉన్నప్పటికీ, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

​జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2025లో వచ్చిన ‘ధురందర్’కు సీక్వెల్‌గా మరియు ఈ సిరీస్‌లో చివరి భాగంగా రాబోతోంది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు