పెద్ది కోసం రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్..!

పెద్ది కోసం రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్..!

Published on Mar 21, 2026 12:00 AM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, దీనిని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

​ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు రామ్ చరణ్ భారీ ప్రచార ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. సుమారు రెండు వారాల పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో చరణ్ పర్యటించనున్నారు. ఈ అగ్రెసివ్ ప్రమోషన్లలో ఆయనతో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొనబోతుండటం విశేషం.

​వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది.

తాజా వార్తలు