యూఎస్ మార్కెట్ లో ‘ఉస్తాద్’ లేటెస్ట్ వసూళ్లు!

యూఎస్ మార్కెట్ లో ‘ఉస్తాద్’ లేటెస్ట్ వసూళ్లు!

Published on Mar 21, 2026 1:20 PM IST

Ustaad Bhagat Singh

ఈ ఉగాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా ఇదే రీతి పెర్ఫార్మన్స్ ని చేస్తుంది.

ఇక ఇలా రీసెంట్ గానే హాఫ్ మిలియన్ మార్క్ ని దాటిన ఈ సినిమా ఇప్పుడు 6 లక్షల డాలర్లు గ్రాస్ ని క్రాస్ చేసి స్టడీగా దూసుకెళ్తుంది. ఇక ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమాకి మంచి నంబర్స్ నమోదు కావచ్చు. అలాగే ఈ ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో కూడా చూడాలి. ఇక ఈ సినిమాలో పార్థిబన్ విలన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు