‘కల్కి సీక్వల్’ షూట్ లో జె.డి.. నిజమేనా ?

‘కల్కి సీక్వల్’ షూట్ లో జె.డి.. నిజమేనా ?

Published on Mar 22, 2026 12:56 PM IST

Kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రభాస్ లేకుండానే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో అమితాబ్ బచ్చన్ పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. ఇప్పుడు, ఒక కొత్త పుకారు వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు నటుడు జె.డి. చక్రవర్తి కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రస్తుత షెడ్యూల్ షూట్ లో జాయిన్ అయ్యారని టాక్ నడుస్తోంది. మరి జె.డి. చక్రవర్తిని ఎప్పుడు ఎంపిక చేశారు, ఆయన పాత్ర ఏమిటి ? అనేది చూడాలి.

ఈ సీక్వెల్‌లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నేచురల్ యాక్ట్రెస్ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలలో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.

తాజా వార్తలు