పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ ఉగాది రిలీజ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులు మెప్పు పొందింది. అయితే ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతూ స్టడీగా దూసుకెళ్తుంది. ఇలా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ నార్త్ అమెరికా మార్కెట్ లో 7 లక్షల డాలర్లు మార్క్ ని అందుకుంది.
అలాగే దీనితో నెక్స్ట్ 1 మిలియన్ మార్క్ దగ్గరకి వెళుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అలా స్టడీ గానే ఈ సినిమా కొనసాగుతుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ పాటలు అందించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే శ్రీలీల, రాశి ఖన్నా పవన్ సరసన నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహించారు.
#UstaadBhagatSingh North America Gross $700K and Counting 🧨#BlockbusterUBS in Cinemas Now ❤️🔥
North America by @PrathyangiraUS@PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @MusicThaman @MythriOfficial @UBSthefilm pic.twitter.com/KHAeBL03b8
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 22, 2026


