గాయపడ్డ సింహం గర్జించేది ఆ రోజే..!

గాయపడ్డ సింహం గర్జించేది ఆ రోజే..!

Published on Mar 23, 2026 12:59 PM IST

Gaayapadda-Simham

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్‌తో ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రాన్ని మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నైజాం మరియు ఆంధ్రప్రదేశ్ పంపిణీ బాధ్యతలను చేపట్టడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు