‘పెద్ది’ టీజర్ పై కొత్త రూమర్.. అది నిజమేనా ?

‘పెద్ది’ టీజర్ పై కొత్త రూమర్.. అది నిజమేనా ?

Published on Mar 23, 2026 11:01 PM IST

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ టీజర్ నిడివి కేవలం 40 సెకన్లు మాత్రమే ఉంటుందని సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, ఇంత తక్కువ నిడివి గల టీజర్‌ తో బుచ్చిబాబు అటు అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘ఫస్ట్ గ్లింప్స్’తో అంచనాలను భారీగా పెంచేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పెద్దిలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట.

తాజా వార్తలు