లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి.. మల్టీస్టారర్ మూవీలో ఫిక్స్..?

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి.. మల్టీస్టారర్ మూవీలో ఫిక్స్..?

Published on Mar 25, 2026 6:05 PM IST

Krithi Shetty 3

టాలీవుడ్ హిట్‌ మెషిన్ అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో ఆయన ఒక క్రేజీ మల్టీస్టారర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో ఎప్పుడూ ముందుండే అనిల్, ఈ చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, కళ్యాణ్ రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మల్టీస్టారర్‌లో కృతి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. మరోవైపు, సీనియర్ హీరో వెంకటేష్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటివరకు తెరపై కనిపించకపోవడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ కాస్టింగ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ పక్కా సంక్రాంతి సినిమా ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు