హైదరాబాద్‌లో ఘనంగా ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక వేడుకలు.. హాజరైన ప్రముఖులు

హైదరాబాద్‌లో ఘనంగా ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక వేడుకలు.. హాజరైన ప్రముఖులు

Published on Mar 28, 2026 10:00 AM IST

Untitled 9

లక్ష్మీ మంచు నేతృత్వంలోని ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం-2026 మార్చి 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగింది. ప్రీమియర్ ఎనర్జీస్ సమర్పణలో, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై తమ మద్దతు తెలిపారు.

విద్యాభివృద్ధికి నిధుల సేకరణలో భాగంగా సినీ, ఫ్యాషన్ రంగాల ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్‌జ్, సాఖీ హెరిటేజ్, రోజ్ జ్యువెలరీ డిజైన్లతో తారలు అడుగులేశారు. సీరత్ కపూర్, పాయల్ రాజ్‌పుత్, జయప్రద, సుహాసిని, ప్రియదర్శి, శివ కందుకూరి సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

2014లో ఏర్పాటైన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,549 ప్రభుత్వ పాఠశాలలకు మద్దతునిస్తూ, 3 లక్షల మందికి పైగా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. “ప్రతి చిన్నారికి వారి నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య అందాలన్నదే మా లక్ష్యం” అని సంస్థ చైర్‌పర్సన్ లక్ష్మీ మంచు పేర్కొన్నారు.

నవోటెల్ కన్వెన్షన్ సెంటర్ సహ ఆతిథ్యం ఇచ్చిన ఈ వేడుకకు ఈవెంట్ గ్లోబల్ ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వారు www.teachforchange.in ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు