‘ధురంధర్’పై తమిళ స్టార్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!

‘ధురంధర్’పై తమిళ స్టార్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!

Published on Mar 28, 2026 6:02 PM IST

vetraman

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ : ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో, ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ వసూళ్లు హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే, ఈ సినిమా విజయం కొనసాగుతుండగానే ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. నేటి కాలంలో ప్రతిదీ ప్రోపగండాగా మారుతోందని, అది ప్రజల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. డీమోనిటైజేషన్ సమయంలో ప్రజలు పడ్డ కష్టాలను ప్రస్తావిస్తూ, కొన్ని సినిమాలు కేవలం ద్వేషపూరిత ప్రోపగండా కోసమే తీస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ‘ధురంధర్’ చిత్రాన్ని ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

వెట్రిమారన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయన మాటలు వైరల్ అవ్వడంతో పాటు, కొందరు నెటిజన్లు ఆయనపై ఎదురుదాడికి దిగుతున్నారు. వెట్రిమారన్ స్వయంగా తన సినిమాల్లో, ముఖ్యంగా ఇటీవలి ‘విడుతలై పార్ట్ 2’లో ఒక వర్గానికి మద్దతుగా ప్రోపగండాను చూపిస్తారని కొందరు వాదిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు