టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన నెక్స్ట్ చిత్రం ‘డెకాయిట్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, శేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో #AskSesh సెషన్‌లో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు థ్రిల్లర్ జోనర్ నుండి ఎప్పుడు బయటకు వస్తారు?’ అని ప్రశ్నించగా, శేష్ స్పందిస్తూ.. ‘డెకాయిట్’ ఆ మార్పు కోసమే చేస్తున్నానని బదులిచ్చాడు. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదని, ఒక అందమైన ప్రేమకథ అని ఆయన వివరించారు. భావోద్వేగాలతో సాగే ఈ చిత్రానికి ‘ప్రేమ’ అనేదే ప్రధానాంశమని శేష్ క్లారిటీ ఇచ్చాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘హిట్-2’ వంటి వరుస థ్రిల్లర్ల తర్వాత శేష్ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 10న బాక్సాఫీస్ వద్ద శేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.


