రాకాస మూవీ బంపర్ ఆఫర్: సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ. 100 మాత్రమే!

రాకాస మూవీ బంపర్ ఆఫర్: సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ. 100 మాత్రమే!

Published on Apr 10, 2026 12:15 PM IST

rakasa

సమ్మర్ సెలవుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన డీసెంట్ ఎంటర్‌టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు, ముఖ్యంగా సామాన్యులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసేందుకు మేకర్స్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో ‘రాకాస’ టికెట్ ధరను కేవలం 100 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఏపీ, తెలంగాణలో శ్రీలక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ వీకెండ్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేందుకు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది.

ఆకట్టుకుంటున్న కామెడీ..

జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకురాలు మానస శర్మ ఈ కథను డీల్ చేసిన విధానం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్లుగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంట స్క్రీన్ మీద న్యాచురల్‌గా కనిపించారు.

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కామెడీ గురించే. సంగీత్, గెటప్ శీను కాంబినేషన్‌లో వచ్చే సీన్స్, వెన్నెల కిషోర్ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి. అర్థవంతమైన కామెడీ ట్రాక్ ఉండటంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లోనూ ‘రాకాస’ డీసెంట్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది.

నిర్మాతగా తన మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’తో సక్సెస్ అందుకున్న నిహారిక.. ఇప్పుడు ‘రాకాస’తో మరో డీసెంట్ హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకున్నారు. ఓవర్ ఎలివేషన్స్ లేకుండా, ప్రశాంతంగా నవ్వుకునే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

తాజా వార్తలు