ఉస్తాద్ ఎఫెక్ట్ : రాజీ పడేది లేదంటున్న పవన్ కళ్యాణ్

ఉస్తాద్ ఎఫెక్ట్ : రాజీ పడేది లేదంటున్న పవన్ కళ్యాణ్

Published on Apr 14, 2026 1:58 PM IST

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రావడంతో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కట్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రొటీన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో పవన్ కెరీర్‌లో ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది.

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ నమ్మకం పెట్టుకున్న పవన్‌కు ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో తాను కమిట్ అయిన నెక్స్ట్ సినిమాపై చాలా జాగ్రత్తగా ఉండాలని పవన్ ఆలోచిస్తున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా లాంచ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, స్క్రిప్టు విషయంలో పవన్ చాలా మార్పులు చెప్పడంతో సురేందర్ అండ్ టీమ్ వాటిని మార్చే పనిలో బిజీగా ఉన్నారు. స్క్రిప్టు పక్కాగా ఉంటేనే పవన్ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడట.

మొత్తానికి ఉస్తాద్ ఎఫెక్ట్‌తో పవన్ తన నెక్స్ట్ మూవీపై చాలా ఫోకస్ పెట్టాడనేది స్పష్టమవుతుంది. కథలో ఎలాంటి రాజీ లేకుండా ఉంటేనే సినిమాను ప్రారంభించాలని పవన్ నిర్ణయించుకున్నాడు. మరి పవన్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు