3000 కోట్ల ‘ధురంధర్’.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన ఫీట్!

3000 కోట్ల ‘ధురంధర్’.. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అరుదైన ఫీట్!

Published on Apr 14, 2026 7:03 PM IST

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే ‘ధురంధర్’. పార్ట్ 1 పై మరీ అంత ఎక్కువ అంచనాలు లేకుండానే థియేటర్స్ లోకి వచ్చింది. పైగా మూడున్నర గంటల రన్ టైం.. సీన్ కట్ చేస్తే ఈ ఫస్ట్ పార్ట్ ఒక ఊహించని సంచలన లాంగ్ రన్ ని చూపించి బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సెట్ చేసింది.

ఇలా 1300 కోట్లకి పైగా గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇదే ఊపుతో పార్ట్ 2 పై పాన్ ఇండియా లెవెల్లో ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అలా విడుదల అయ్యిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేసింది. రికార్డు వసూళ్లు అందుకొని ఇప్పుడు 1700 కోట్ల మార్క్ ని దాటి మరింత సంచలనం సెట్ చేసింది.

అయితే ఇండియన్ సినిమా దగ్గర ధురంధర్ ఫ్రాంచైజ్ ఒక అరుదైన ఫీట్ ని సెట్ చేసింది. ఇది వరకు వచ్చిన అన్ని సినిమాల ఫ్రాంచైజ్ లు అందుకోని 3000 కోట్ల మార్క్ ని ఈ ఫ్రాంచైజ్ అందుకొని చరిత్ర సృష్టించింది. మరి ఈ క్రేజీ రికార్డుని బ్రేక్ చేయడం ఏ సినిమాతో కుదురుతుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు