ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ ఫాంటసీ సినిమానే “రాకా”. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ని ఈ సినిమా క్రియేట్ చేసింది. అయితే ఈ లుక్ కి ముందు వరకు సినిమా కాన్సెప్ట్ కి సంబంధించి ఎలాంటి లీక్ బయటకి రాకుండా మేకర్స్ చూసుకున్నారు కానీ పోస్టర్ వచ్చిన తర్వాత నుంచి మాత్రం పలు ఇంట్రెస్టింగ్ అంశాలు ఒకొకటిగా వస్తున్నాయి.
వాటిలో భాగంగా ఓ క్రేజీ బజ్ ఇపుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉదయం మనిషిలా రాత్రి అయ్యాక మృగంగా మారుతుంది అనే ఓ లైన్ తో వినిపిస్తుంది. ఈ టాక్ వచ్చాక అట్లీపై మళ్ళీ చాలామంది డౌట్స్ పడుతున్నారు. అట్లీ భారీ హిట్స్ ఇచ్చినప్పటికీ తన సినిమాల్లో కంటెంట్ మాత్రం ఏదో మిక్స్డ్ జ్యూస్ లానే ఉంటుంది అనే కామెంట్స్ ఉన్నాయి.
సరే వాటిని దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఓ సాలిడ్ సబ్జెక్టు అల్లు అర్జున్ తో తెస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో చూసేసిన తరహా కాన్సెప్ట్ అంతెందుకు మన దగ్గరే బాలీవుడ్ లో ఇటీవల “బేడియా” అనే సినిమా కూడా వచ్చింది. సో ఇవన్నీ వింటుంటే మళ్ళీ అట్లీ ఏదో కిచిడీ చేసేలా ఉన్నాడే అనిపిస్తుంది. మరి వీటిని మించి ఏమైనా తాను మ్యాజిక్ చేస్తాడో లేదో వేచి చూడక తప్పదు.


