‘కాకా’పై చిరు లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

‘కాకా’పై చిరు లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

Published on Sep 25, 2026 10:01 PM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘కాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందనే విషయంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. యంగ్ హీరో సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇక ఈ సందర్భంగా ఆయన కాకా చిత్ర షూటింగ్ విషయాన్ని పంచుకున్నారు.

కాకా ఫస్ట్ హాఫ్ ఇప్పటికే పూర్తయ్యిందని.. ప్రస్తుతం సెకండాఫ్ కూడా 30 శాతం పూర్తయ్యిందని.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చిరు చెప్పారు. దీంతో కాకా స్పీడ్‌కు మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు