మొత్తం కోలీవుడ్ లోనే రికార్డ్.. ‘జైలర్ 2’ కి షాకింగ్ ఓటిటి డీల్ ఎంతో తెలుసా!

మొత్తం కోలీవుడ్ లోనే రికార్డ్.. ‘జైలర్ 2’ కి షాకింగ్ ఓటిటి డీల్ ఎంతో తెలుసా!

Published on Apr 18, 2026 9:01 PM IST

Jailer2

ప్రస్తుతం సౌత్ సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ సీక్వెల్ సినిమా జైలర్ 2 కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ హైప్ ని సెట్ చేసుకొని ఉంది.

ఇక విడుదలకి సన్నద్ధం అవుతున్న ఈ సినిమా ఓటిటి డీల్ కి సంబంధించిన అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. జైలర్ 2 కి తమిళ సినిమా చరిత్రలోనే ఏ సినిమాకి రాని బిగ్గెస్ట్ డీల్ ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అందించినట్టు తెలుస్తుంది.

వారు ఈ సినిమాకి ఏకంగా 160 కోట్లు ఇచ్చి పాన్ ఇండియా భాషల్లో హక్కులు సొంతం చేసుకున్నారట. దీనితో ఈ షాకింగ్ ఫిగర్ వైరల్ గా మారింది. దీనికి ముందు విజయ్ లియో, జన నాయగన్ లాంటి సినిమాలు 120 కోట్లకి పైగా ఉన్నాయి. వాటిని మించి జైలర్ 2 కి సెన్సేషనల్ డీల్ రావడం అనేది ఈ సినిమా పట్ల క్రేజ్ ఎలా ఉందో చెబుతుంది.

తాజా వార్తలు