సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !

సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !

Published on May 1, 2026 5:02 PM IST

Gaayapadda-Simham-1

విడుదల తేదీ : మే 1, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శ్రీవిష్ణు, తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, జె. డి. చక్రవర్తి, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు.
దర్శకుడు : కశ్యప్ శ్రీనివాస్
నిర్మాతలు : కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప,
విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్.
సంగీతం :
ఛాయాగ్రహణం : విద్యాసాగర్ చింత
కూర్పు : విప్లవ్ నైషధం

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా గాయపడ్డ సింహం. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం రండి.

కథ :

దరహాస్ (తరుణ్ భాస్కర్) గాయత్రి (మానస చౌదరి) తో ప్రేమలో పడతాడు. అయితే, గాయత్రి ఫాదర్ పెట్టిన కండిషన్ కారణంగా అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దరహాస్ అమెరికా ప్రయత్నాలు చేస్తాడు. ఐతే, దరహాస్ అమెరికా ప్రయాణం విఫలం అవుతుంది. అందుకు కారణం ఏమిటి ?, దరహాస్ అమెరికా నుంచి వచ్చేయడానికి కారణమైన వ్యక్తి ఎవరు ?,  అతని పై దరహాస్ ఎలాంటి రివేంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు ?, ఆ తర్వాత దరహాస్ జీవితంలోకి షాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా వచ్చింది ?, ఈ మధ్యలో పోలీసుల పాత్ర ఏమిటి ?, అసలు ధర్మ (జె. డి. చక్రవర్తి) ఎవరు? అతనికి ఈ కథకు సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎంటర్టైన్ మెంట్ టోన్ లో సాగిన ఈ గాయపడ్డ సింహం సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అలాగే శ్రీవిష్ణు ట్రాక్ కూడా బాగుంది. ఎప్పటిలాగే శ్రీవిష్ణు తన టైమింగ్ తో కొన్ని చోట్ల నవ్వించాడు. ప్రధాన పాత్రలో నటించిన తరుణ్ భాస్కర్ కూడా బాగా నటించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. తరుణ్ భాస్కర్ నటించిన విధానం ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటన పర్వాలేదు. మరో హీరోయిన్ మానస చౌదరీ తన స్క్రీన్ ప్రెజెన్సీతో ఆడియన్స్ కు రిలీఫ్ ఇచ్చింది.

ఇక విలన్ గా నటించిన జె. డి. చక్రవర్తి తన శైలి  టైమింగ్ తో మెప్పించాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. హీరో ఫ్రెండ్ గా నటించిన కశ్యప్ శ్రీనివాస్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన  విష్ణు ఓయ్, హర్షవర్ధన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ట్రంప్ క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ట్రంప్ పాత్రతో పాటు హీరో దరహాస్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ట్రాక్ ను, ముఖ్యంగా శ్రీవిష్ణు ఫ్యామిలీ డ్రామాను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్, అంతే స్థాయిలో మిగిలిన పాత్రలను మరియు సీన్స్ ను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. మొత్తానికి స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది. దీనికితోడు ఈ గాయపడ్డ సింహం సినిమా చూస్తున్నంతసేపు సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. కానీ, ఒక సీన్ కి మరొక సీన్ కి మధ్య టెంపో పెంచలేకపోయారు. దరహాస్ పాత్రకు – మిగిలిన పాత్రలకు మధ్య ఇంకా బలమైన సంఘర్షణ పెడితే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా విద్యాసాగర్ చింత చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ విప్లవ్ నైషధం తగ్గించాల్సింది. నిర్మాతలు కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘గాయపడ్డ సింహం’ అంటూ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. ట్రంప్ – శ్రీవిష్ణు ట్రాక్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. నటీనటుల నటన కూడా బాగానే ఉంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ సింపుల్ స్టోరీ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు