బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “పెద్ది” ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం. అయితే, ఈ చిత్రం ఇతర భాషల్లో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ భారీగా విడుదల చేస్తోంది. జూన్ 5న వరుణ్ ధావన్ నటించిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మినహా హిందీలో వేరే పెద్ద సినిమాలు ఏవీ పోటీలో లేవు. ఇది “పెద్ది” చిత్రానికి కలిసొచ్చే అంశం. కేవలం సానుకూల టాక్ వస్తే చాలు, హిందీ మార్కెట్‌లో ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. కేవలం హిందీలోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రస్తుతం చెప్పుకోదగ్గ రిలీజ్ లు ఏవీ లేకపోవడం ఈ చిత్రానికి మరింత ప్లస్ పాయింట్ కానుంది.
చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను కూడా అత్యంత భారీగా ప్లాన్ చేస్తోంది. ప్రధాన నగరాల్లో రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ స్వయంగా పాల్గొని సినిమాను ప్రమోట్ చేయనున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, తన వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 4న ఈ చిత్రం పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో శబ్దం చేస్తుందో చూడాలి.


