విషాదం : ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కన్నుమూత

విషాదం : ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కన్నుమూత

Published on May 5, 2026 8:00 PM IST

సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నిర్మాత ఆర్‌.బి. చౌదరి నేడు ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద వార్తతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.

​రాజస్థానీ కుటుంబానికి చెందిన చౌదరి, మాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆపై తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నిన్నే ప్రేమిస్తా, సింహరాశి, సంక్రాంతి, గాడ్‌ఫాదర్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఆయన నిర్మించారు.

​తమిళ హీరో జీవా తండ్రి అయిన ఆర్‌.బి. చౌదరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప నిర్మాతను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు