ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!

Published on May 6, 2026 1:03 AM IST

Love Insurance Kompany

ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యూచరిస్టిక్ రోమ్-కామ్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK)’, థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

​తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ, విమర్శకుల నుండి నెగటివ్ రివ్యూలు రావడంతో ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో ఇది మొదటి పరాజయంగా నిలిచింది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె. సూర్య, యోగి బాబు, గౌరీ కిషన్ మరియు మిస్కిన్ కీలక పాత్రలు పోషించారు.

​సెవెన్ స్క్రీన్ స్టూడియో మరియు నయనతార సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో ఆదరణ లభించని ఈ సినిమా, మరి ఓటీటీ వేదికపై డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు