‘ఎల్లమ్మ’ కష్టాలు తీరేదెప్పుడో.. కొనసాగుతోన్న హీరోయిన్ వేట..!

‘ఎల్లమ్మ’ కష్టాలు తీరేదెప్పుడో.. కొనసాగుతోన్న హీరోయిన్ వేట..!

Published on May 8, 2026 10:00 PM IST

Yellamma

‘బలగం’ వంటి సంచలన విజయం తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న నెక్స్ట్ చిత్రం ‘ఎల్లమ్మ’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన ప్రేమకథ కోసం మొదట నాని, శర్వానంద్, నితిన్ వంటి హీరోలను అనుకున్నప్పటికీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ చేతికి చిక్కింది. చాలా కాలంగా నటనపై ఆసక్తి చూపిస్తున్న డీఎస్పీ, ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, డి-గ్లామ్ లుక్‌లో ఉండటంతో సరైన నటిని ఎంపిక చేయడం చిత్ర యూనిట్‌కు సవాలుగా మారింది. గతంలో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లను సంప్రదించినప్పటికీ, వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. హీరోగా డీఎస్పీకి ఇది తొలి సినిమా కావడం మరియు మేకప్ లేకుండా నటించాల్సి రావడంతో టాప్ హీరోయిన్లు వెనుకడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దిల్ రాజు టీమ్ ఈ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ను సంప్రదించి చర్చలు జరుపుతోంది. ఈ క్రేజీ రోల్ కోసం మృణాల్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుండటంతో, మృణాల్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక పూర్తయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు