జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!

జార్జ్ కుట్టి ఈజ్ బ్యాక్: ఉత్కంఠ రేపుతున్న ‘దృశ్యం 3’ మలయాళ ట్రైలర్!

Published on May 9, 2026 8:00 PM IST

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాలకు కొనసాగింపుగా ‘దృశ్యం-3’ చిత్రంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మోహన్ లాల్ రెడీ అయ్యాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌లో జార్జ్ కుట్టి(మోహన్ లాల్) మళ్ళీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంచుకున్న కొత్త మార్గాలు మరియు పాత కేసు నుంచి ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించారు. ‘ఒక సాధారణ కుటుంబం మీదకు వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి ఎంతవరకైనా వెళ్తాను’ అనే అర్థం వచ్చేలా ఉన్న డైలాగ్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కథలో మరిన్ని ట్విస్టులు, ఎమోషన్స్‌ను జోడించినట్లు తెలుస్తోంది.

ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు