పెద్ది సర్‌ప్రైజ్ : గౌర్నాయుడు పాత్రలో శివ రాజ్‌కుమార్ సాలిడ్ ఎంట్రీ..!

పెద్ది సర్‌ప్రైజ్ : గౌర్నాయుడు పాత్రలో శివ రాజ్‌కుమార్ సాలిడ్ ఎంట్రీ..!

Published on May 14, 2026 8:54 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి మే 18న ట్రైలర్ లాంచ్ కానుంది. దీనికి ముందే, చిత్ర బృందం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోషిస్తున్న ‘గౌర్నాయుడు’ పాత్రకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో శివరాజ్ కుమార్ కుస్తీ శిక్షకుడిగా నటిస్తున్నారు. ఒక క్రికెటర్‌గా ఉన్న పెద్దిని, తన కఠినమైన శిక్షణ ద్వారా మల్లయోధుడిగా ఆయన ఎలా మార్చారనేది ఈ వీడియోలో చూపించారు. ఇక చరణ్‌ను పెహల్వాన్‌గా మార్చడంలో గౌర్నాయుడు ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నాడనేది మనకు వెండితెరపై అద్భుతంగా చూపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు