ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో 37 మందితో ఏకకాలంలో రికార్డు సృష్టించి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక మైలురాయి తర్వాత, ఈ అరుదైన రికార్డు వెనుక ఉన్న కష్టాన్ని ప్రతిబింబించేలా చిత్రబృందం ఒక విజువల్లీ స్టన్నింగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
దర్శకుడు అట్లీ విజన్‌కు అనుగుణంగా ఈ అసాధ్యాన్ని సాధ్యం చేయడం కోసం నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇండియాలోనే ప్రత్యేకంగా ఒక కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేయగా, ఈ బీటీఎస్ వీడియో ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ మేకింగ్ వీడియోలోని ఊహకందని యాక్షన్ సీక్వెన్సెస్, సాయి అభ్యంకర్ అందించిన ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అట్లీ ఆలోచనలను, ఆయన మేకింగ్ విధానాన్ని అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రశంసించగా, టాప్ హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి చిత్రబృందం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.
ఈ ప్రపంచ రికార్డు సాధించడం పట్ల బన్నీ ఎంతో గర్వంగా ఉందని వ్యక్తం చేయగా, రాబోయే సంచలనాలకు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని దర్శకుడు అట్లీ ధీమా వ్యక్తం చేశారు.
A global triumph in motion capture! 🏆🌎#Raaka sets a Guinness World Record for the 'Most People Motion-Captured in Real-Time', with 37 performers captured simultaneously ✨@alluarjun @Atlee_dir @GWR#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords pic.twitter.com/hotAxnrgfE
— Sun Pictures (@sunpictures) September 21, 2026


