ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’ భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ రికార్డును సాధించింది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 37 మంది పర్‌ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేసి ఈ సినిమా బృందం సరికొత్త మైలురాయిని నెలకొల్పింది.
ఈ ఘనతకు గానూ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సర్టిఫికేట్‌ను హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ అధికారికంగా అందుకున్నారు. సాంకేతికంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ ప్రయోగంపై నెటిజన్లు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్’ విభాగంలో ఈ రికార్డు నమోదు కావడం గమనార్హం.
ప్రస్తుతం ఈ సెన్సేషనల్ విజయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ‘రాకా’ చిత్రంపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.



