‘ధురంధర్’కు పోటీగా పాకిస్థానీ ‘ల్యారీ’.. కామెడీ బాగుంది..!

‘ధురంధర్’కు పోటీగా పాకిస్థానీ ‘ల్యారీ’.. కామెడీ బాగుంది..!

Published on May 15, 2026 10:00 AM IST

Mera-Lyari

భారతీయ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’ చిత్రానికి పాకిస్థాన్ సమాధానంగా ‘మేరా ల్యారీ’ అనే చిత్రాన్ని రిలీజ్ చేసింది. ధురంధర్ చిత్రంలో ల్యారీ పట్టణంలో కథ జరగడంతో తమ దేశానికి చెందిన పేరును ఇండియా వారు వాడుకుని హిట్ కొట్టారనే అసూయతో పాకిస్థాన్ దర్శకనిర్మాతలు ఈ ‘మేరా ల్యారీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. అంతేగాక, ఈ సినిమా ధురంధర్‌ను మించి ఉంటుందని కామెంట్స్ కూడా చేశారు.

కట్ చేస్తే.. ‘మేరా ల్యారీ’ థియేటర్లలో దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాను నెటిజన్లు కొంతవరకు అభినందించినా, ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కొన్ని థియేటర్లలో కేవలం 22 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవడంతో, విడుదలైన కొద్దిరోజుల్లోనే అనేక చోట్ల ప్రదర్శనలు నిలిపివేశారు. అబు అలీహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కరాచీలోని ల్యారీ ప్రాంతంలో మహిళల ఫుట్‌బాల్ నేపథ్యంలో సాగుతుంది. వికలాంగురాలైన ఫుట్‌బాల్ కోచ్‌గా ఆయేషా ఒమర్ నటించగా, సామాజిక ఒత్తిళ్లను అధిగమించి యువతులు తమ కలలను ఎలా సాకారం చేసుకున్నారనేది ఇందులో చూపించారు.

ల్యారీ ప్రాంతంలోని శాంతి మరియు గర్వాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసిన ఈ సినిమాకు సింధ్ మంత్రి మద్దతు కూడా లభించింది. అయితే, రణ్‌వీర్ సింగ్ నటించిన ఇండియన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’లో ల్యారీ ప్రాంతాన్ని గ్యాంగ్ వార్స్, నేరాలకు నిలయంగా చూపించడంతో దానికి కౌంటర్‌గా ఈ సినిమాను అక్కడి నెటిజన్లు పోల్చారు. కానీ ఈ పోలికలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఫలించలేదు. దీంతో ‘ధురంధర్’ గ్లోబల్ హిట్‌గా నిలవగా ‘మేరా ల్యారీ’ మాత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

తాజా వార్తలు