సూర్య మాస్ కంబ్యాక్.. డే 1 కి భారీ బుకింగ్స్.. లియో, కూలీ దగ్గరలో

సూర్య మాస్ కంబ్యాక్.. డే 1 కి భారీ బుకింగ్స్.. లియో, కూలీ దగ్గరలో

Published on May 16, 2026 9:07 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రమే ‘కరుప్పు’. దర్శకుడు ఆర్ జే బాలాజీ కలయికలో చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ సూర్య అభిమానులు కోరుకుంటున్న కంబ్యాక్ సినిమాల నిలిచే లానే ఉందని చెప్పాలి. తెలుగులో వీర భద్రుడు గా విడుదల అయ్యిన ఈ చిత్రం రెండు చోట్లా మంచి టాక్ ని సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేయడం విశేషం.

అయితే డే 1 కి బుక్ మై షోలో కరుప్పు, వీరభద్రుడు కి గత 24 గంటల్లో నమోదు అయ్యిన బుకింగ్స్ చూస్తే మాత్రం సూర్య నుంచి ఇది మాస్ కంబ్యాక్ అని చెప్పాల్సిందే. నిజానికి ఈ చిత్రం పట్ల కోలీవుడ్ నుంచి నెక్స్ట్ లెవెల్ హైప్ లో వచ్చిన కూలీ, లియో రేంజ్ హైప్ లేదు కానీ వాటి దగ్గరలో బుకింగ్స్ నమోదు కావడం అనేది షాకింగ్ అని చెప్పాలి. తెలుగు తమిళ్ కలిపి గత 24 గంటల్లో సూర్య సినిమా ఏకంగా 7 లక్షల టికెట్స్ ని బుక్ చేసుకుంది.

ఇందులో 6 లక్షల 50 వేలకి దగ్గర టికెట్స్ తమిళ్ నుంచే తెగాయి. దీనితో కరుప్పు టాప్ బుకింగ్స్ లో మూడో ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో లియో 7 లక్షల 50 వేలు, కూలి 7 లక్షల 15 వేలు టికెట్స్ మొదటి రోజుకి బుక్ అయినట్టు తెలుస్తుంది. వాటి మీద ఉన్న హైప్ తో పోలిస్తే సూర్య సినిమా ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తాజా వార్తలు