‘నల్లమల’ దర్శకుడి నుంచి ఒకేసారి రెండు కొత్త సినిమాలు

‘నల్లమల’ దర్శకుడి నుంచి ఒకేసారి రెండు కొత్త సినిమాలు

Published on May 30, 2026 8:35 AM IST

Director Ravi Charan's Nawab

‘నల్లమల’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రవిచరణ్ తన తదుపరి రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న రెండో చిత్రం ‘నవాబ్’, మూడో చిత్రం ‘జెన్ జి గర్ల్స్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ప్రస్తుత సమాజంలో నిత్యం ఎదురయ్యే వ్యక్తులు, భిన్నమైన నేపథ్యాల స్ఫూర్తితో ఈ రెండు చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలను జోడిస్తూనే, వాస్తవికతకు దగ్గరగా ఈ కథలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే ‘నవాబ్’ సినిమా నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఆయన మూడో చిత్రం ‘జెన్ జి గర్ల్స్’ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని చిత్రబృందం ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు