సంతోష్ కల్వచెర్ల హీరోగా ‘మొహబ్బత్’.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

సంతోష్ కల్వచెర్ల హీరోగా ‘మొహబ్బత్’.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Published on Jun 5, 2026 1:38 PM IST

MLA Naveen Yadav

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మొహబ్బత్’ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్లాప్ ఇచ్చి, చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఇదొక ఎమోషనల్ యూత్‌ఫుల్ జెన్-జీ ప్రేమకథ అని దర్శకుడు మ్యాక్ తెలిపారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కలాం కథ, మాటలు సమకూర్చారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Mohabbat

సంబంధిత సమాచారం

తాజా వార్తలు