ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర తెరకెక్కుతున్న పలు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తున్న సినిమా “రాకా” కూడా ఒకటి. దర్శకుడు అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో చేస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గత కొన్నాళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే ఈ సినిమా విడుదలకి సంబంధించి క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం రాకా వచ్చే ఏడాది డిసెంబర్ మొదటి వారంలో అలా విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒకింత ఆలస్యమే అయినప్పటికీ అల్లు అర్జున్ కి సెంటిమెంట్ గా కూడా ఇది కలిసొచ్చే అంశమే అని చెప్పాలి.
బన్నీ గత రెండు సినిమాలు పుష్ప 1 అలాగే పుష్ప 2 యాదృచ్చికంగా ముందు ఒక డేట్ అనుకోని తర్వాత డిసెంబర్ నెలలోనే విడుదల అయ్యి సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే డిసెంబర్ సెంటిమెంట్ గా రాకా కూడా అప్పుడే బరిలోకి దిగనుంది అని టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


