మన టాలీవుడ్ మాస్ కా దాస్ యువ హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న తాను లేటెస్ట్ గా ‘దీవానా’ అనే యూత్ ఫుల్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నాడు. అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ థియేటర్స్ లో జరిగిన ఇదే ఈవెంట్ కి దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరు కాగా తనతో విశ్వక్ సేన్ సంభాషణ వైరల్ గా మారింది.
నా మీద పగేమన్నా ఉందా సర్ అంటూ స్టార్ట్ చేసి అల్లు అరవింద్ గారితో సినిమా అంటే ఇప్పుడు అయినా సరే తన మొదటి సినిమాకి ఎలా వెళ్ళానో అలా వెళ్లి ఆడిషన్ ఇస్తాను అని తెలిపాడు. అన్ని డబ్బులు ఏం చేసుకుంటారు సార్, ఈ థియేటర్ మీదే, కూర్చున్న సీట్ కూడా మీదే మాలాంటోళ్ళకి పంచిపెట్టండి సార్ అంటూ తమలాంటి యువ నటీనటులని తమ బ్యానర్ లో సినిమాలు చేయాలనే రీతిలో చేసిన కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. అలాగే అల్లు అరవింద్ కూడా ఎప్పుడు నుంచో విశ్వక్ తో సినిమా చేయాలి అనే అనుకున్నాం కానీ కుదరలేదు అని తెలిపారు.


