సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్ అండ్ రన్’. సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా విడుదల చేశారు.
ఈ చిత్రంలో నటాషా సింగ్ ‘సాక్షి’ అనే రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తుండగా, విజయ్ భాస్కర్ సద్దాల, ఎల్. గంగాధర్ సినిమాటోగ్రాఫర్లుగా, డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


