అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విడుదల జూలై 10వ తేదీకి వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత కోసమే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్స్ మరియు బజ్ కాస్త తగ్గాయి.
అయితే, ఈ సినిమాలో ఒక సీనియర్ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే క్రేజీ టాక్ నడుస్తోంది. కథలో కీలకమైన ఈ వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాలను పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కాకపోతే ఇది కేవలం ఇంట్రో కోసమా లేక సినిమా మొత్తం ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఆ స్టార్ హీరో ఎవరనే దానిపై నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


