టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ మార్చింది. గ్లామర్ పాత్రలకు గుడ్ బై చెప్పేసి, పవర్‌ఫుల్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్‌పై కన్నేసింది. ఈ క్రమంలోనే ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆమె నటించిన ‘విశాఖ’ వెబ్ సిరీస్‌తో ఇప్పుడు ఓటీటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ఈ సిరీస్‌లో కాజల్ ఒకేసారి రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనుండటం విశేషం. ఒకవైపు అమాయకమైన గృహిణిగా నటిస్తూనే, మరోవైపు గన్ పట్టిన ‘లేడీ డాన్’గా యాక్షన్ మోడ్‌లో అదరగొట్టనుంది. సుస్మితా సేన్ సూపర్ హిట్ సిరీస్ ‘ఆర్య’ తరహాలోనే ఈ ‘విశాఖ’ కూడా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామాగా సాగుతుందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. జూలై లేదా ఆగస్టులో ‘జియో హాట్‌స్టార్’ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఒక పక్క ఈ వెబ్ సిరీస్ చేస్తూనే, మరోపక్క బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీలోనూ కాజల్ మెయిన్ లీడ్‌గా నటిస్తోంది. అటు సినిమాలు, ఇటు ఓటీటీ ప్రాజెక్టులతో ఈ యాక్షన్ క్వీన్ టాలీవుడ్‌లో మళ్లీ బిజీగా మారిపోయింది.


