‘హ్యాపీ’ ఎఫెక్ట్.. ‘ఆర్య’ క్యాష్ చేసుకుంటాడా..?

‘హ్యాపీ’ ఎఫెక్ట్.. ‘ఆర్య’ క్యాష్ చేసుకుంటాడా..?

Published on Jun 16, 2026 8:30 PM IST

స్టార్ హీరోల పాత సినిమాలు రీ-రిలీజ్ కావడం టాలీవుడ్‌లో కామన్ విషయమే. అయితే, కేరళలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టిస్తున్న రికార్డులు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం నాటి ఫ్లాప్ మూవీ ‘హ్యాపీ’ అక్కడ రీ-రిలీజ్ అయి, కేవలం నాలుగు రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసింది.

కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి షోలు సైతం హౌస్‌ఫుల్ కావడం బన్నీకి అక్కడున్న వీర ఫ్యాన్ బేస్‌కు నిదర్శనం. అల్లు అర్జున్ ఎనర్జీ, యువన్ శంకర్ రాజా సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఈ ‘హ్యాపీ’ ప్రభంజనంతో కేరళలో బన్నీ పాత సినిమాలకు డిమాండ్ అమాంతం పెరిగింది.

దీనిని క్యాష్ చేసుకునేందుకు ఆయన క్లాసిక్ హిట్ ‘ఆర్య’ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీతో పాటు అన్ని ప్రధాన భాషల్లో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పుష్ప’ హీరోగా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్, ‘ఆర్య’లోని వన్‌సైడ్ లవ్ కాన్సెప్ట్, దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ పాటలు ఈ రీ-రిలీజ్‌కు భారీగా ప్లస్ కానున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు