సమంత మాస్ కంబ్యాక్.. గ్యాప్ ఇచ్చినా ర్యాంపేజ్ తగ్గలేదు

సమంత మాస్ కంబ్యాక్.. గ్యాప్ ఇచ్చినా ర్యాంపేజ్ తగ్గలేదు

Published on Jun 20, 2026 12:05 AM IST

స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ టాలీవుడ్ సినిమానే మా ఇంటి బంగారం. దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేసిన రెండో సినిమా ఇది కాగా టాలీవుడ్ లో చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నుంచి ఈ సినిమా వచ్చింది. అయితే చాలా మంది ఈ సినిమాని తక్కువ అంచనా వేసిన వారికి మాత్రం సమంత షాకిచ్చింది అని చెప్పాల్సిందే.

నిజానికి యూఎస్ మార్కెట్ సహా తెలుగు స్టేట్స్ లో కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ మరియు ప్రీ సేల్స్ చూసిన ఈ సినిమా టాక్ కూడా బాగానే తెచ్చుకోవడంతో బుకింగ్స్ ర్యాంపేజ్ పెరిగింది. ప్రస్తుతం బుక్ మై షోలో గంటకి 10 వేలకి పైగా టికెట్ బుకింగ్ సేల్స్ ఈ సినిమాకి కొనసాగుతున్నాయి. సో సమంత మాత్రం గట్టి కం బ్యాక్ నే టాలీవుడ్ లో ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సమంత నిర్మాణం కూడా వహించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు