ప్రభాస్ ఐఫోన్ వాల్ పేపర్ వైరల్.. ఏముందో తెలుసా!

ప్రభాస్ ఐఫోన్ వాల్ పేపర్ వైరల్.. ఏముందో తెలుసా!

Published on Jun 19, 2026 11:00 PM IST

Prabhas

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాల్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటుగా చిన్నపాటి ప్రమోషనల్ కార్యక్రమంలో కూడా డార్లింగ్ పాల్గొనడం జరిగింది. అయితే లేటెస్ట్ గా తన కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ కాన్సెప్ట్ చిత్రం సింగ్ గీతం కోసం డైనోసార్ కదిలి వచ్చాడు.

అయితే ఈ ఇంటర్వ్యూ లేటెస్ట్ గా రివీల్ కాగా ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని కనిపెట్టారు. ప్రభాస్ ఇప్పుడు వాడుతున్న ఐఫోన్ లో లాక్ స్క్రీన్ వాల్ పేపర్ చూసి ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇంతకీ అదేంటంటే ప్రభాస్ కర్ణ పోస్టర్ ని వాల్ పేపర్ గా పెట్టుకోవడం విశేషంగా మారింది.

ప్రభాస్ ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పటికీ కల్కి నుంచి కర్ణ పోస్టర్ ని పెట్టుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంకొందరు ఇది కేవలం ప్రమోషనల్ గా కూడా అయ్యి ఉండొచ్చు అని భావిస్తున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

తాజా వార్తలు