సందీప్ కోసం ప్రభాస్ ప్రామిస్.. ఏమిటంటే..?

సందీప్ కోసం ప్రభాస్ ప్రామిస్.. ఏమిటంటే..?

Published on Jul 2, 2026 4:57 PM IST

Spirit

​’బాహుబలి’ తర్వాత పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఇటీవల ‘రాజా సాబ్’ సినిమా తర్వాత తన ‘బాడీ డబుల్’ వాడకంపై ఎదురైన విమర్శలకు గట్టి సమాధానం చెప్పబోతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎలాంటి బాడీ డబుల్ ఉపయోగించనని, ప్రతి సీన్ తానే స్వయంగా నటిస్తానని దర్శకుడికి మాట ఇచ్చారు.

​చేతిలో వరుస సినిమాలు ఉన్నప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ చిత్రానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దర్శకుడి ప్లాన్ ప్రకారం భారీగా బల్క్ డేట్స్ కేటాయించారు. ప్రభాస్ చూపిస్తున్న ఈ అంకితభావం వల్లే ఎలాంటి రీషూట్లు, ఆలస్యం లేకుండా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే సెట్స్ నుండి లీకైన ప్రభాస్ లుక్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. సందీప్ వంగాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభాస్ శ్రమిస్తుండటంతో, వచ్చే ఏడాది ఈ చిత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం థియేటర్లలోకి రానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు