మహానటి, సీతారామం చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన కెరీర్‌లో 41వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘DQ41’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు (శుక్రవారం) ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్యూర్ ఎమోషనల్ లవ్ డ్రామా అని అర్థమవుతోంది. ‘#LoveWillSparkAgain’ (ప్రేమ మళ్లీ చిగురిస్తుంది) అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో.. ఒక అందమైన చెట్టు, దానిపై పక్షుల గూడు, ప్రహరీ గోడపై ఉన్న రెండు కాఫీ కప్పులు సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రవి నెలకుదితి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి స్టార్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. అనయ్ ఓం గోస్వామి కెమెరా బాధ్యతలు చూస్తుండగా, సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. మరి రేపు రాబోయే టైటిల్ ఎలా ఉండబోతుందో చూడాలి.



