విషాదం : దివంగత నటుడు శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత

విషాదం : దివంగత నటుడు శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత

Published on Jul 10, 2026 3:59 PM IST

నటభూషణ, స్వర్గీయ శోభన్ బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ఇటీవల ఆరోగ్యం క్షిణించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో శోభన్ బాబు అభిమానులు, సినీ చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శోభన్ బాబు స్టార్ హీరోగా ఎదగడానికంటే ముందే, 1958లో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సినీ పరిశ్రమలో అగ్ర హీరో భార్య అయినప్పటికీ, శాంతకుమారి గారు ఎప్పుడూ మీడియా లైమ్‌లైట్‌కు దూరంగా, ఎంతో సాదాసీదాగా జీవించారు. శోభన్ బాబు కూడా తన పిల్లలను సినీ పరిశ్రమ వైపు ప్రోత్సహించకుండా, వ్యాపార రంగంలో స్థిరపడేలా చూశారు. సినిమా తారల కుటుంబాల్లో కనిపించే హడావుడికి భిన్నంగా వీరి కుటుంబం ఎల్లప్పుడూ ప్రైవేట్ జీవితానికే ప్రాధాన్యతనిచ్చింది.

శోభన్ బాబు భార్య శాంతకుమారి మరణవార్త తెలుసుకుని టాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు