టాలీవుడ్‌లో ‘పిల్ల జమిందార్’, ‘భాగమతి’ వంటి చిత్రాలను తెరకెక్కించిన చిత్ర దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై రూ.3.5 కోట్ల ఆర్థిక మోసం కేసు నమోదైంది. ఒక కుటుంబానికి చెందిన యువకుడిని వెండితెరకు హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి, ఆయన ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మాటిచ్చినట్లు సినిమా చేయకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం అశోక్ బాబును విచారిస్తున్నారు. ఈ కేసులో అశోక్ బాబుతో పాటు నిర్మాత విజయలక్ష్మి కూడా మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


