గాడ్ ఆఫ్ వార్ : ఇక్కడ ఎన్టీఆర్.. అక్కడ ధనుష్.. సేమ్ టు సేమ్..!

గాడ్ ఆఫ్ వార్ : ఇక్కడ ఎన్టీఆర్.. అక్కడ ధనుష్.. సేమ్ టు సేమ్..!

Published on Jul 10, 2026 11:02 PM IST

కోలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన నేషనల్ అవార్డ్ విన్నర్స్ ధనుష్, వెట్రిమారన్ మరోసారి చేతులు కలపబోతున్నారు. ‘పొల్లాదవన్’, ‘ఆడుగళం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి క్లాసిక్ హిట్స్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘తమిళ్‌ మురుగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఒక హిస్టారికల్ ఎపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

అయితే, ఇటీవల టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పుడు తమిళంలోనూ ఇదే తరహా కథ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, సరికొత్త కథాంశంతో రాబోతున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌తోనే ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు