‘మసూద’ డైరెక్టర్‌తో నాగచైతన్య మూవీ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పుకార్లు..!

‘మసూద’ డైరెక్టర్‌తో నాగచైతన్య మూవీ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పుకార్లు..!

Published on Jul 11, 2026 4:03 PM IST

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ‘తండేల్’ చిత్రం తర్వాత కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తి కాకముందే చైతూ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే రెండు ఆసక్తికరమైన కథలను లైన్లో పెట్టిన ఆయన, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా నాగచైతన్య ‘మసూద’ చిత్ర దర్శకుడు సాయికిరణ్‌తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సాయికిరణ్, గత రెండేళ్లుగా ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌పై వర్క్ చేశాడని.. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం చైతూను సంప్రదించగా.. ఆయన కథ విన్నాడని పెద్ద ఎత్తున వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నాగ చైతన్య హారర్ జోనర్‌లో సినిమా చేయబోతున్నాడనేది కేవలం పుకారేనని తెలుస్తోంది.

మరోవైపు, నాగచైతన్య ఇప్పటికే ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘వృషకర్మ’ షూటింగ్ ముగిసిన వెంటనే, ఈ ఏడాది చివర్లోనే క్లాక్స్ చిత్రం పట్టాలెక్కనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు