స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. ఐతే, ఈ సినిమాకి పోటీగా ధనుష్ – వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్ మురుగన్’ రాబోతుంది. రెండు చిత్రాలు సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్నాయి. పైగా రెండు చిత్రాల్లో కథా గమనం ఒకేలా ఉండబోతుందని టాక్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాక్షసుల పై సుబ్రహ్మణ్య స్వామి చేసిన యుద్ధాల నేపథ్యమే ప్రధాన కథాంశం. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. ‘తమిళ్ మురుగన్’ ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
అందుకే, త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ పై మళ్లీ ఫోకస్ పెట్టాడట. సుబ్రహ్మణ్య స్వామి కథతో పాటు.. సుబ్రహ్మణ్య స్వామి పాత్రలోని దైవత్వాన్ని బలంగా చూపించే విధంగా త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఇక నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీగా బజ్ క్రియేట్ అయింది.


