అఖిల్ 2.0.. ‘లెనిన్’ సక్సెస్ ని తలకెక్కించుకోని అయ్యగారు.. ఇది క్లారిటీ అంటే

అఖిల్ 2.0.. ‘లెనిన్’ సక్సెస్ ని తలకెక్కించుకోని అయ్యగారు.. ఇది క్లారిటీ అంటే

Published on Jul 16, 2026 7:00 AM IST

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అలానే కాలానుగుణంగా అది నేర్పే పాఠాలు, మార్చే పరిస్థితులు రీత్యా ప్రతీ ఒక్కరిలో కూడా ఏదొక మార్పు వస్తుంది. అలానే ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఎంతో క్లియర్ గా కనిపిస్తున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సక్సెస్ ని లెనిన్ రూపంలో ఇప్పుడు కొట్టాడు. సరే హిట్ కొట్టేసా కదా అని ఆ సక్సెస్ ని ఏమాత్రం తను తలకి ఎక్కించుకునే ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా మంచి విషయం. పైపెచ్చు ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అభిమానులకి ప్రామిస్ చేసి అఖిల్ తన పరిపక్వతను చాటుకొని కెరీర్ లో కొత్త జర్నీ కోసం సిద్ధం అవుతున్నట్టు తెలిపాడు.

తన నుంచి తరహా టర్న్ అనేది చాలామంది ఊహించి ఉండకపోవచ్చు. కానీ అఖిల్ చూపించిన ఈ పరిపక్వత మాత్రం ఫ్యూచర్ లో తనకి మరింత మంచి పేరు తెచ్చి పెట్టడం ఖాయం. సో లెనిన్ తర్వాత అఖిల్ అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు