ది వన్.. స్టైలిష్ పోస్టర్స్ తో విశ్వనాథ్ గా అదరగొట్టిన సూర్య!

ది వన్.. స్టైలిష్ పోస్టర్స్ తో విశ్వనాథ్ గా అదరగొట్టిన సూర్య!

Published on Jul 23, 2026 11:05 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ది వన్ సూర్యకి అక్కడితో పాటుగా మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన మాస్ హిట్ చిత్రం ‘వీరభద్రుడు’ తో సూర్య సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో మాస్ లుక్స్ తో తాను అలరిస్తే మళ్ళీ ‘గజిని’ లాంటోయ్ రోజులు తీసుకొచ్చేలా మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తో అతి త్వరలో రాబోతున్నారు.

అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. సూర్య పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన పోస్టర్స్ లో సూర్య స్టైలిష్ లుక్స్ మంచి వైరల్ గా మారాయి. బ్రౌన్ సూట్ లో సూపర్ స్టైలిష్ డ్రెస్సింగ్ తో సూర్య మళ్ళీ వింటేజ్ మోడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఈ బర్త్ డేన మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇక దీనితోనే మేకర్స్ రెండో సాంగ్ ఈ సాయంత్రం విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. దాని కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు